- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటి సంపులో పడి చిన్నారి మృతి!
by Ajay Maddhiboyina |
వేములవాడ అర్బన్ మండలంలోని చింతల ఠాణా ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది.

X
దిశ, వేములవాడ టౌన్: వేములవాడ అర్బన్ మండలంలోని చింతల ఠాణా ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో శనివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న రిషి (4) అనే చిన్నారి అకస్మాత్తుగా ఇంటి సమీపంలోని నీటి సంపులో పడిపోవడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పిల్లాడి అరుపులు ఎవరికీ వినిపించకపోవడంతో, కొన్ని క్షణాల తరువాత గమనించిన కుటుంబ సభ్యులు అతడిని బయటకు తీశారు. అయితే అప్పటికే శ్వాస ఆగిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.చిన్నారి మరణ వార్తతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామస్థులు, బంధువులు పెద్ద సంఖ్యలో రిషి కుటుంబాన్ని పరామర్శించారు.ఈ సంఘటనపై సంబంధిత పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు
Next Story






