- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చిలకలూరిపేట ప్రమాద ఘటన.. మృతుల వివరాలు ఇవే
పల్నాడు జిల్లా చిలకలూరిపేట గణపవరం గ్రామ పరిధిలో 16బైపాస్ పై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా చిలకలూరిపేట గణపవరం గ్రామ పరిధిలో 16బైపాస్ పై గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ల లోడుతో వెళుతున్న ఓ కంటైనర్‌ను కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదురుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. చనిపోయినవారిలో మేడగం రామిరెడ్డి - తాళ్లూరు గ్రామం అద్దంకి మండలం, శివరాత్రి మహేశ్ - పిడుగురాళ్ల టౌన్, మెరుపు శ్రీకాంత్ - శివాపురం వినుకొండ, వంగవోలు వాసు - వినుకొండ, గొడవర్తి యశ్వంత్ సాయి - ములకలూరు గ్రామం వినుకొండ ఉన్నారు. క్షతగాత్రుల్లో మద్దుకూరి కార్తీక్, చలపతిలు ఉన్నారు. అతివేగంగా వచ్చి ఢీ కొట్టడం వల్లనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రయాణికులు గుంటూరు నుండి పల్నాడు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు అంతా యువకులే కావడంతో చేతికొచ్చిన కొడుకులు మరణించడంతో ఆ కుటుంబాల్లో విషాద చాయలు అలుముకున్నాయి.






