- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చర్లపల్లి తల్లీపిల్లల సూసైడ్ కేసు.. ఎట్టకేలకు వీడిన మిస్టరీ!
మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌కు చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మిస్టరీ వీడినట్లుగా తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌కు చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయారెడ్డి (Vijaya Reddy) తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మిస్టరీ వీడినట్లుగా తెలుస్తోంది. డిప్రెషన్ (Depression)తోనే ఆమె చనిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. అయితే ఆమె డిప్రెషన్‌కు కారణాలపై కేసులో మరింత సమాచారం సేకరించాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదటి నుంచి తల్లి మాటలను తూచా తప్పకుండా పాటించేలా పిల్లలు ఉండటంతో, ఆ కంట్రోల్‌తోనే వాళ్లను కూడా ఆమె తన వెంట తీసుకెళ్లినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. తల్లి ఏం చెబితే అది చేసేందుకు సిద్ధమై విజయారెడ్డితో కలిసి పిల్లలు కూడా జనవరి 30న రాత్రి హైదరాబాద్-ఘట్‌కేసర్ మార్గంలో చర్లపల్లి (Charlapally) వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
ఇక విజయారెడ్డి రెండో ఫోన్ వాడారనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా చనిపోవడానికి వారం రోజుల ముందు కాల్‌డేటాపై కూడా సమగ్రంగా విచారణ చేపట్టామని తెలిపారు. కేసులో ఆమె పనిచేసే ఆఫీసులో 16 మందితో పాటు, బంధువులను విచారించగా ఎలాంటి అనుమానాస్పద లీడ్ దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు.






