భర్తకు తెలియకుండా అప్పు చేసి.. త‌ర‌వాత దుకాణంలో చోరీకి యత్నించి!

by Ajay Maddhiboyina |

భర్తకు తెలియకుండా అప్పు చేసిన ఓ మహిళ చేసిన అప్పు తీర్చేందుకు నగల దుకాణంలో చోరీకి యత్నించింది. దుకాణం సిబ్బంది ప‌ట్టుకోవ‌డంతో పోలీస్ స్టేష‌న్ కు వెళ్లాల్సి వ‌చ్చింది.

భర్తకు తెలియకుండా అప్పు చేసి.. త‌ర‌వాత దుకాణంలో చోరీకి యత్నించి!
X

దిశ‌, వెబ్ డెస్క్: భర్తకు తెలియకుండా అప్పు చేసిన ఓ మహిళ చేసిన అప్పు తీర్చేందుకు నగల దుకాణంలో చోరీకి యత్నించింది. దుకాణం సిబ్బంది ప‌ట్టుకోవ‌డంతో పోలీస్ స్టేష‌న్ కు వెళ్లాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న చెన్నైలోని కాల‌డిప్పేటైలో చోటు చేసుకుంది. జ‌య చిత్ర అనే మ‌హిళ త‌న భ‌ర్త‌కు తెలియ‌కుండా అప్పులు చేసింది. విచ్చ‌ల విడిగా త‌న ఖ‌ర్చుల కోసం అప్పులు చేయ‌గా అవి కట్టాల్సిన ప‌రిస్థితి రావ‌డంతో ఎలా క‌ట్టాలో తెలియ‌క ఆందోళ‌న చెందింది. ఈ క్ర‌మంలో దొంగ‌త‌నం త‌ప్ప వేరే దారి లేద‌నుకుందో ఏమో కానీ ఓ న‌గ‌ల దుకాణంపై క‌న్నేసింది.

క‌నిపించ‌కుండా ఉండేందుకు బుర్కా ధ‌రించి, ఎదురొస్తే పొడిచేందుకు ఓ క‌త్తిని సైతం తీసుకువెళ్లింది. అయితే షాపులో ముగ్గురు సిబ్బంది ఉండటంతో ఆమె ప్లాన్ బెడిసికొట్టింది. కూర్చుని మాట్లాడుతుండగా యజమాని చేతిలో ఉన్న నగలు లాక్కునే ప్రయత్నం చేసింది. వెంటనే అతడు చేయిపట్టుకోగా అతడిపై కారం చల్లింది. తరవాత కత్తి తీసి దాడికి యత్నించగా పక్కనే మరో ఇద్దరు సైతం మహిళను గట్టిగా పట్టుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు. భర్తకు తెలియకుండా చేసిన అప్పును తీర్చడం కోసమే మహిళ దొంగతనానికి పాల్పడినట్టు నిర్దారించారు.

Next Story