వంటమాస్టర్ వంచన.. గదిలో మద్యం, తరువాత అత్యాచారం..!

by Bhanu |   (  Updated:2025-06-25 13:32:39  IST  )

యువతిపై వంటమాస్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

వంటమాస్టర్ వంచన.. గదిలో మద్యం, తరువాత అత్యాచారం..!
X

దిశ, డైనమిక్ బ్యూరో : యువతిపై వంటమాస్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సీహెచ్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సత్యప్రకాశ్ (30) నగరానికి వలసవచ్చి రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ హోటల్ లో వంట మాస్టర్ గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి గచ్చిబౌలిలోని ఓ వైన్ షాప్ కు వెళ్లి మద్యం సేవిస్తుండగా అక్కడికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువతి మద్యం కొనుకునేందుకు డబ్బులు కావాలని సత్య ప్రకాష్ ను అడిగింది.

ఇక్కడ కూర్చుని అమ్మాయిలు మందు తాగితే బాగుండదని, తన రూమ్ కు వస్తే మందు తాగిస్తానని సత్య ప్రకాష్ యువతిని తన గదికి తీసుకు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ మద్యం సేవించారు. మద్యం మత్తులోకి వెళ్లిన యువతిపై సత్యప్రకాశ్ అత్యాచారం చేశాడు. అర్థరాత్రి మెలుకువ వచ్చిన యువతి బట్టలు చెల్లా చెదురుగా ఉండడంతో తనపై అత్యాచారం జరిగినట్టు గుర్తించి అతనిని నిలదీసింది.

నీ న్యూడ్ వీడియోలు నా దగ్గర ఉన్నాయి, ఎవరికైనా చెబితే వాటిని బయటపెడతానంటూ సత్యప్రకాశ్ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి సత్యప్రకాశ్ దగ్గర నుండి తప్పించుకుని వచ్చి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిపై అత్యాచారానికి పాల్పడిన సత్యప్రకాశ్ ను అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి నిందితుడిని రిమాండ్ కు తరలించారు.

Next Story