- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైద్యశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడిపై చీటింగ్ కేసు..
by Bhanu |
వైద్య శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.10 లక్షలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు.

X
దిశ, ఆదిలాబాద్: వైద్య శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.10 లక్షలు తీసుకొని మోసం చేసిన వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కు చెందిన తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు రంగినేని శ్రీనివాస్ రావ్ అనే వ్యక్తి ఆశగిరి హనుమాన్లు కుమారుడికి వైద్యశాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని 3 సంవత్సరాల క్రితం రూ.10 లక్షలు తీసుకొని మొహం చాటేసాడు.దీంతో మోసపోయానని గ్రహించిన బాధితులు ఈనెల 8న వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.
Next Story






