- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ పేరుతో మోసం, అబార్షన్.. యువతి మృతి
ప్రేమ పేరుతో మోసం చేసి అబార్షన్ చేయించడంతో వైద్యం వికటించి యువతి మృతి చెందింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా ఐబీ తాండూర్ లో చోటు చేసుకుంది. తాండూర్ ఐబీ చెందిన భాగ్యలక్ష్మి అనే యువతి హైదరాబాద్ లో ఏఎన్ఎంగా ఉద్యోగం చేస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రేమ పేరుతో మోసం చేసి అబార్షన్ చేయించడంతో వైద్యం వికటించి యువతి మృతి చెందింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా ఐబీ తాండూర్ లో చోటు చేసుకుంది. తాండూర్ ఐబీ చెందిన భాగ్యలక్ష్మి అనే యువతి హైదరాబాద్ లో ఏఎన్ఎంగా ఉద్యోగం చేస్తోంది. కాగా తాండూర్ గ్రామానికి చెందిన గట్టు జగదీష్ తో గత కొంతకాలంగా భాగ్యలక్ష్మి ప్రేమలో ఉంది. ఈ క్రమంలో ఇద్దరూ దగ్గరవ్వగా యువతి గర్భం దాల్చింది. గర్భస్రావం అయ్యేందుకు జగదీష్ కొన్ని మాత్రలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది.
హైదరాబాద్ లో ఆస్పత్రిలో చూపించేందుకు ప్రయత్నించినా అడ్మిట్ చేసుకోలేదు. దీంతో జగదీష్ తనకు కర్నూలులో ఓ ఆస్పత్రి తెలుసు అని చెప్పి తీసుకువెళ్లాడు. అక్కడ వైద్యం చేస్తుండగా వికటించి యువతి మరణించింది. దీంతో యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన జగదీష్ భాగ్యలక్షి అనారోగ్యానికి గురవ్వడంతో తన స్నేహితులతో కలిసి ఆస్పత్రికి తీసుకురాగా మరణించిందని చెప్పాడు. తన సోదరి మృతికి జగదీష్ కారణం అని యువతి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి వేధింపుల వల్లనే తన సోదరి మరణించిందని చెప్పాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.






