చంచల్ గూడ జైలులో దోస్తానా.. విడుదలై డ్రగ్స్ ముఠా ఏర్పాటు...

by Bhanu |

జైలు లో కలిసిన స్నేహం మత్తు దందా చేసే ముఠా ఏర్పాటుకు వేదికైంది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత డ్రగ్స్ దందా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను శుక్రవారం హైదరాబాద్ యాంటీ నార్కోటిక్ బ్యూరో, గోల్కోండ పోలీసులు అరెస్టు చేశారు.

చంచల్ గూడ జైలులో దోస్తానా.. విడుదలై డ్రగ్స్ ముఠా ఏర్పాటు...
X

దిశ, సిటీక్రైం : జైలు లో కలిసిన స్నేహం మత్తు దందా చేసే ముఠా ఏర్పాటుకు వేదికైంది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత డ్రగ్స్ దందా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను శుక్రవారం హైదరాబాద్ యాంటీ నార్కోటిక్ బ్యూరో, గోల్కోండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి కొకైన్, ఎండిఎంఏ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం...నైజీరియాకు చెందిన కాస్మోస్ రామ్సే పై 3, లక్మీపతి పై8, రోమి భరత్ కళ్యాన్ పై 3, జాఫర్ ఖాన్ పై 2 బోనిఫేస్ పై 2 ఎన్ డిపీఎస్ కేసులు ఉన్నాయి. ఈ కేసులు హైదరాబాద్, గోవా, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్ లలో నమోదయ్యాయి. ఈ ఐదుగురు అరెస్టై చంచల్ గూడ్ జైలుకు వెళ్ళినప్పుడు ఒకే బ్యారక్ లో ఉన్నారు. దీంతో ఈ ఐదుగురు మధ్య ఫ్రెండ్ షిప్ ఏర్పడింది.

ఈ పరిచయంతో జైలు నుంచి విడుదలైన తర్వాత ఒకరినొకరు సంప్రదించుకుని డ్రగ్స్ దందాకు శ్రీకారం చుట్టారు. దీని కోసం నైజీరియాకు చెందిన కాస్టోస్ గోల్కోండ్ పోలీసు స్టేషన్ పరిధిలోని వినాయక్ నగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అందరూ అక్కడ కలుస్తు దందాను కొనసాగిస్తున్నారు. కాస్మోస్ ముంబాయికి చెందిన జేమ్స్ నుంచి కొకైన్, ఎండిఎంఏ డ్రగ్స్ ను తీసుకుంటుండగా లక్ష్మిపతి , భరత్ కళ్యాన్ లు గోవాకు చెందిన జాక్ , సికింద్రాబాద్ కు చెందిన మహేష్, సైనిక్ పురికి చెందిన సుశీల్, ల నుంచి డ్రగ్స్ ను కొనుగొలు చేస్తున్నాడు. ఇటీవల లక్ష్మిపతి బెంగళూరు కు వెళ్ళి కొంత డ్రగ్స్ ను కొనుగొలు చేసేందుకు ప్రయత్నించాడు. దీని కోసం కాస్మోస్, భరత్ కళ్యాన్, జాఫర్ ఖాన్ నెట్ వర్క్ ను సంప్రదించాడు.

అదే విధంగా వారిని కూడా కొకైన్ , ఎండిఎంఏ డ్రగ్స్ కావాలని డబ్బులు చెల్లించాడు. ఈ డ్రగ్స్ ను తీసుకునేందుకు గోల్కోండ్ వినాయక్ నగర్ లోని కాస్మోస్ ఇంటికి లక్ష్మిపతి, జాఫర్ ఖాన్, భరత్ కళ్యాన్, బోనిఫేస్ అడికేలు వచ్చారు. వారు డ్రగ్స్ ను సరఫరా చేసేందుకు సిద్ధం చేసుకుంటుండగా పోలీసులు, టీజీ నాబ్ అధికారులు సోదాలు జరిపి ఈ ఐదుగురిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 20 గ్రాముల కొకైన్, 45 గ్రాముల ఎండిఎంఏ, 20 గ్రాముల ఎక్సటసీ పిల్స్ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 40 వేల నగదు, 6 సెల్ ఫోన్ లను రికవరి చేశారు. ఈ ఐదుగురు హైదరాబాద్ లో 25 మందికి నిత్యం డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ 25 మందిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వీరి మొబైల్ ఫోన్ లను విశ్లేషిస్తే మరికొంత మంది డ్రగ్స్ ను వాడుతున్న చిట్టా పోలీసులకు లభించే అవకాశం ఉంది. వీరిదరీని కూడా పోలీసులు విచారించనున్నారు.

Next Story