- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శతాధిక వృద్ధురాలు మృతి
by Ratna Kumari |
దిశ, నారాయణ పేట ప్రతినిధి : నేటి కాలంలో 50 ఏళ్ళు బతికితేనే మహా అనుకునే కాలంలో ఓ వృద్ధురాలు ఏకంగా 100 ఏళ్ళు

X
దిశ, నారాయణ పేట ప్రతినిధి : నేటి కాలంలో 50 ఏళ్ళు బతికితేనే మహా అనుకునే కాలంలో ఓ వృద్ధురాలు ఏకంగా 100 ఏళ్ళు దాటి చివరకి 101 వయసులో అనారోగ్య రీత్యా చనిపోయింది. వివరాల్లోకి వెళితే.. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని పూసల్ పహాడ్ గ్రామంలో శతాధిక వృద్ధురాలు మృతి చెందింది. గ్రామానికి చెందిన షేర్ వెంకటమ్మ (101) భర్త షేర్ ఎల్లారెడ్డి తో కలిసి వ్యవసాయం చేస్తుండేది. గత కొన్ని సంవత్సరాల క్రితం భర్త చనిపోగా కుమారుల దగ్గర ఉండేది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందింది. ఈమెకు ఇద్దరు కుమారులు కాగా ఒకరు షేర్ సత్యనారాయణ రెడ్డి మాజీ పిఎసిఎస్ వైస్ చైర్మెన్ గా పనిచేశారు. మరొకరు షేర్ కృష్ణారెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉంటూ తపస్ ఉపాధ్యాయ సంఘం నారాయణ పేట జిల్లా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.
Next Story






