ఏపీలో విషాదం.. ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్

by velandi.Saikiran |

ఏపీలో విషాదం.. ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్ ఏపీలో విషాదం.. ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్

ఏపీలో విషాదం.. ప్యాంట్ జేబులో పేలిన సెల్ ఫోన్
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ( Andhra Pradesh ) పెను విషాదం చోటు చేసుకుంది. జేబులో పెట్టుకున్న మొబైల్ ఫోన్ ( MOBILE ) ఒక్కసారిగా..బాంబు తరహాలో పేలిపోయింది. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా మిట్స్ కాలేజీలో గురువారం రోజున జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా మిట్స్ కాలేజీ థర్డ్ ఇయర్ బీటెక్ స్టూడెంట్ తనూజ్ (Tanuj)... తరచూ తన జేబులోనే మొబైల్ పెట్టుకుంటూ ఉంటాడు.

గురువారం కూడా ఎప్పటిలాగే జేబులో మొబైల్ ఫోన్ పెట్టుకొని కాలేజీకి వెళ్ళాడు. ఈ నేపథ్యంలోనే కాస్త హీటెక్కిన ఆ మొబైల్ ఫోన్... బ్లాస్ట్ అయింది. దీంతో జేబు నుంచి బయటపడిన మొబైల్ ఫోన్ దాదాపు 60 శాతం దగ్ధమైంది. అటు గాయపడిన తనూజ్ ను వెంటనే మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అధికారులు. ఇంకా ఈ సంఘటనపై స్థానిక పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మొబైల్ ఫోన్స్ వాడడం చాలా ప్రమాదకరమైన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రస్తుత అవసరాల నేపథ్యంలో మొబైల్స్ వాడుతున్నారు జనాలు. అయితే మితిమీరి మొబైల్ ఫోన్స్ వాడడం కూడా ప్రమాదమే. అలా వాడితే... ఇలా మొబైల్ ఫోన్స్ పేలడం గ్యారంటీ అని చెబుతున్నారు నిపుణులు.

Next Story