NEET Score Scam: నీట్ స్కోర్ వ్యవహారంపై CBI కేసు నమోదు

by Gantepaka Srikanth |

నీట్‌ (యూజీ) ఫలితాలు వచ్చేశాయి. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ (NEET UG 2025) ఫలితాలను ఎన్‌టీఏ(NTA) అధికారులు శనివారం విడుదల చేశారు.

NEET Score Scam: నీట్ స్కోర్ వ్యవహారంపై CBI కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: నీట్‌ (యూజీ) ఫలితాలు వచ్చేశాయి. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ యూజీ (NEET UG 2025) ఫలితాలను ఎన్‌టీఏ(NTA) అధికారులు శనివారం విడుదల చేశారు. మే 4న జరిగిన నీట్‌ (యూజీ) పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరించిన అధికారులు.. తాజాగా ఫలితాలను ప్రకటించారు. అయితే.. నీట్ ఫలితాల వేళ మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలో నీట్ స్కోర్‌లను తారుమారు చేసి అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసి, మోసానికి పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ కేసులో సీబీఐ దర్యాప్తును కొనసాగిస్తోంది.

Next Story