హైదరాబాద్‌లో క్యాష్ ట్రాప్ ముఠా కలకలం

by Ajay Maddhiboyina |

హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో క్యాష్ ట్రాప్ ముఠా కలకలం రేపుతోంది. ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తే క్యాష్ బయటకు వచ్చినట్టు స్క్రీన్ పై చూపిస్తుంది కానీ డబ్బులు మాత్రం రావడంలేదు.

హైదరాబాద్‌లో క్యాష్ ట్రాప్ ముఠా కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ జూబ్లిహిల్స్ లో క్యాష్ ట్రాప్ ముఠా కలకలం రేపుతోంది. ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తే క్యాష్ బయటకు వచ్చినట్టు స్క్రీన్ పై చూపిస్తుంది కానీ డబ్బులు మాత్రం రావడంలేదు. అది చూసి టెక్నికల్ సమస్య అనుకుని వెళ్లిపోయిన ఖాతాదారులకు మాత్రం ఊహించని షాక్ తగులుతోంది. కస్టమర్ వెళ్లిపోయిన తరవాత క్యాష్ ట్రాప్ ముఠా ఏటీఎంలోకి వెళ్లి డబ్బును బయటకు లాగుతోంది. దీనికోసం కస్టమర్లు ఏటీఎంలోకి వెళ్లే ముందే ముఠా ప్లాస్టిక్ కార్డులు అడ్డుపెట్టి డబ్బులు బయటకు రాకుండా చేస్తోంది.

కస్టమర్ లోపలికి వెళ్లి వచ్చిన తరవాత వెళ్లి ఆ కార్డు అడ్డు తొలగించి డబ్బు దోచుకుంటోంది. 15 రోజుల్లోనే ఇలాంటి ఘటనలు 3 చోటు చేసకుకున్నట్టు జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందింది. విచారణ ప్రారంభించిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా ముఠాను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలోనూ ఏటీఎంల వద్ద ఇలాంటి మోసాలు అనేకం చోటు చేసుకున్నాయి. నిందితులను పోలీసులు పట్టుకోవడంతో కొత్త దారులు వెతికి మరీ ఇలాంటి మోసాలకు పాల్పడటం ఆందోళనకంగా మారింది.

Next Story