- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిడ్డ పెళ్లి కోసం దాచిన నగదు,బంగారం అపహరణ
by Chintha Aamani |
బిడ్డ పెళ్లి కోసం దాచిన నగదు బంగారం చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

X
దిశ,నందిగామ: బిడ్డ పెళ్లి కోసం దాచిన నగదు బంగారం చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన చాకలి కృష్ణయ్య భార్య కూతురు తో జీవనం కొనసాగిస్తున్నారు. అతనికి కొందుర్గు మండలం మహాదేవపూర్ లో 2 ఎకరాల 20 గుంటల పొలం ఉండేది. ఈ మధ్యకాలంలో ఆ భూమిని విక్రయించాడు. వచ్చిన డబ్బుతో బిడ్డ పెళ్లి కని 16 తులాల బంగారం,రూ 15 లక్షల నగదును ఇంట్లో దాచాడు. ఈనెల 26 కృష్ణయ్యకు బ్యాంక్ నుంచి క్రాప్ లోన్ కట్టాలని ఫోన్ వచ్చింది. ఇంటికి వెళ్లి చూడగా, నగదు బంగారం కనబడకపోవడం తో లబోదిబో మన్నాడు. వెంటనే బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.
Next Story






