Pashamylaram : పాశమైలారం ఘటన.. సిగాచీ కంపెనీపై కేసు నమోదు

by Muthe.Rajitha |

పాశమైలారం(Pashamylaram) ఘటనపై తొలి కేసు నమోదైంది(Case Filed).

Pashamylaram : పాశమైలారం ఘటన.. సిగాచీ కంపెనీపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్ : పాశమైలారం(Pashamylaram) ఘటనపై తొలి కేసు నమోదైంది(Case Filed). సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువులోని పాశమైలారం పారిశ్రామిక వాడలో సిగాచీ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు(Sigachi Explosion) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి వరకు 39 మంది మృతి చెందగా, మరో 30 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండే అవకాశం ఉందని సహాయక బృందాలు పేర్కొన్నాయి. కాగా ఈ ఘటనపై బీడీఎల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఓ బాధిత కుటుంబానికి చెందిన యశ్వంత్ ఫిర్యాదు చేయడంతో సిగాచీ కంపెనీ యాజమాన్యంపై 105, 110, 117 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Next Story