గొప్ప కూతురివి తల్లి.. పైసల కోసం తల్లి మరణాన్నే దాచింది!

by Gantepaka Srikanth |

కన్నతల్లికి, చిన్న పిల్లలకు చిన్న దెబ్బ తాకితే ఎవరూ తట్టుకోలేరు. కన్నీరు పెట్టి విలవిలలాడిపోతుంటారు.

గొప్ప కూతురివి తల్లి.. పైసల కోసం తల్లి మరణాన్నే దాచింది!
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నతల్లికి, చిన్న పిల్లలకు చిన్న దెబ్బ తాకితే ఎవరూ తట్టుకోలేరు. కన్నీరు పెట్టి విలవిలలాడిపోతుంటారు. అలాంటిది ఓ కూతురు డబ్బుల కోసం ఏకంగా తల్లి మరణాన్నే దాచింది. ఈ అమానుష ఘటన హైదరాబాద్‌లోని మధురానగర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రేణుక అనే మహిళ తల్లి టీజీఎస్ పీడీసీఎల్ (TGSPDCL) సంస్థలో పనిచేసి రిటైర్ అయింది. ఈ విషయాన్ని సదరు సంస్థ అధికారులకు తెలియకుండా దాచి.. తన తల్లి పేరు మీద ప్రతి నెలా జమ అవుతున్న పింఛన్ సొమ్మును ఆమె గుట్టుచప్పుడు కాకుండా విత్ డ్రా చేస్తూ వచ్చింది. ఇలా సుమారు రూ. 6.45 లక్షల రూపాయల వరకు పెన్షన్ డబ్బులను అక్రమంగా డ్రా చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తనిఖీల్లో భాగంగా అసలు విషయం బయటపడటంతో అధికారులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తాజాగా మోసంపై టీజీఎస్ పీడీసీఎల్ అధికారులు సీరియస్‌గా స్పందించారు. రేణుకపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఏయే బ్యాంకుల ద్వారా ఈ సొమ్మును డ్రా చేసింది, ఇందులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.

Next Story