ఆ పూజలు చేస్తానంటూ లేడీ అఘోరి ఘరానా మోసం.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మహిళ

by Sumithra |   ( Updated:2025-04-15 02:53:23.0  )
ఆ పూజలు చేస్తానంటూ లేడీ అఘోరి ఘరానా మోసం.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన మహిళ
X

దిశ, శంకర్ పల్లి : తనను అఘోరి మోసం చేసిందని ఓ మహిళ ఫిర్యాదు మేరకు మోకిలా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రత్యేక పూజలు చేయిస్తానని చెప్పి తనను అఘోరి మోసం చేసిందని ఓ మహిళ ఫిబ్రవరి 25వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. శంకర్పల్లి మండలం పొద్దుటూరు గ్రామ పరిధిలోని ప్రగతి రిసార్ట్ లో నివాసం ఉంటున్న మహిళకు అఘోరీ ( శివ విష్ణు బ్రహ్మ అల్లూరి - శ్రీనివాస్)కి పరిచయం ఏర్పడిందని తెలిపారు.

అయితే అఘోరి ప్రగతి రిసార్ట్ లోని ఆ మహిళ ఇంటికి వచ్చి పూజలు చేసిందని తెలిపారు. అఘోరి ఆ మహిళను ఉజ్జయినికి సైతం తీసుకెళ్లి అక్కడ సైతం పూజలు చేయించిందన్నారు. దీనికిగాను ఆ మహిళ రూ. 9.80 లక్షలను అఘోరికి ముట్ట చెప్పింది. అయితే ఏమైందో ఏమో గాని తనను అఘోరి మోసం చేసిందని ఆ మహిళ మోకిల పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు 308(5), 318(1), 351(4) ,352 బీఎస్ఎన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు అయిన విషయాన్ని కూడా గోప్యంగా ఉంచారు. కేసు విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫిబ్రవరి 25వ తేదీన కేసు నమోదైనట్లు మోకిలా పోలీసులు చెప్పడం గమనార్హం.

Read More..

Trending: అన్నంత పని చేశారుగా..! వర్షిణీని పెళ్లి చేసుకున్న అఘోరీ (వీడియో వైరల్)



Next Story

Most Viewed