సాయిబాబా దేవుడు కాదంటూ ప్రచారం.. నటి మాధవీలతపై కేసు నమోదు

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ నటి మాధవీలతకు ఊహించని షాక్ తగిలింది. నటిపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మాధవీలత సోషల్ మీడియాలో సాయి బాబా దేవుడు కాదు అంటూ పోస్టులు పెట్టారు.

సాయిబాబా దేవుడు కాదంటూ ప్రచారం.. నటి మాధవీలతపై కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలతకు ఊహించని షాక్ తగిలింది. నటిపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మాధవీలత సోషల్ మీడియాలో సాయి బాబా దేవుడు కాదు అంటూ పోస్టులు పెట్టారు. దీంతో ఆమెపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాధవీలతతో పాటు సాయిబాబా దేవుడు కాదని ప్రచారం చేసిన పలువురు యూట్యూబర్లు,సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపైనా కేసులు నమోదు చేశారు.

మాధవీలత ఇతర సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ల పోస్టుల కారణంగా ప్రజల భావోద్వేగాలకు నష్టం జరుగుతుందని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. కేసులు నమోదైనవాళ్లు మంగళవారం ఉదయం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని పోలీసులు ఆదేశించారు. ఇక ఈ కేసులపై ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఫిర్యాదు అందిన యూట్యూబర్లు, నటి మాధవీలత సోషల్ మీడియా ఖాతాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం.

Next Story