- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Case Filed: ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామ శివారులో సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామ శివారులో సిరిసిల్ల డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ వ్యక్తి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తన కారుకు సైడ్ ఇవ్వలేదనే కారణంతో బస్సును వెంబడించి బస్సు డ్రైవర్ బాలరాజ్‌పై దాడి చేశాడు. ఈ విషయంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. విధుల్లో ఉన్న డ్రైవర్‌పై దాడి చేయడం హేయమైన చర్య అని ఆయన ఖండించారు. జిల్లా ఎస్పీ గీతే మహేష్ బాబాసాహెబ్‌తో మంత్రి ఫోన్‌లో మాట్లాడి, దాడి ఘటనపై తక్షణం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి చేసి కారులో పరారైన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన విధులను ఆటంకపరచడమే కాకుండా దాడి చేశాడని బస్సు డ్రైవర్ ఫిర్యాదు చేయగా, ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని, ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని ఎస్సై అశోక్ తెలిపారు.






