- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎస్‌యూవీని ఢీకొన్న కారు.. మంటలు చెలరేగి ఎనిమిది మంది దుర్మరణం..
by Sujitha Rachapalli |
గుజరాత్ సురేంద్ర నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడ్వాన్ తాలూకా దేదాదర విలేజ్ సమీపంలో హైవేపై దుర్ఘటన చోటు చేసుకుంది. కడు నుంచి సురేంద్ర నగర్ వెళ్తున్న కారు.. ఎస్‌యూవీని

X
దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ సురేంద్ర నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వడ్వాన్ తాలూకా దేదాదర విలేజ్ సమీపంలో హైవేపై దుర్ఘటన చోటు చేసుకుంది. కడు నుంచి సురేంద్ర నగర్ వెళ్తున్న కారు.. ఎస్‌యూవీని ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఆ తర్వాత కారులో మంటలు చెలరేగడంతో డ్రైవర్‌తో సహా అందులో ఉన్న ఏడుగురు మరణించారు. ఇందులో ఐదుగురు స్త్రీలు, ఇద్దరు పిల్లలు, డ్రైవర్ ఉన్నారు. ఇక ఎస్‌యూవీలో ఉన్న ముగ్గురు వ్యక్తులు గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేసి.. మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం హాస్పిటల్‌కు పంపించారు. హైవేపై జరిగిన ప్రమాదంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Next Story






