లారీని ఢీకొట్టిన కారు నుజ్జునుజ్జు.. ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

by Kema Shiva Kumar |

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం చవటపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన ఇద్దరు మృతి చెందారు.

లారీని ఢీకొట్టిన కారు నుజ్జునుజ్జు.. ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ఇద్దురు దుర్మరణపాలవగా, మరో ఐదుగురికి తీవ్ర గాయలైన విషాద ఘటన చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు (Puthalapattu) మండలం చవటపల్లి (Chavatapally) శివారులో ఇవాళ ఉదయం సంభవించింది. అతివేగంగా ప్రయాణిస్తున్న కారు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. బాధితులు కర్నూలు జిల్లాకు చెందిన వారిగి గుర్తించారు. వారంతా తమిళనాడులోని తిరువన్నామలై (Tiruvannamalai) ఆలయాన్ని దర్శించుకుని, అక్కడి నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం కారులో బయలుదేరారు. పూతలపట్టు - నాయుడుపేట రహదారిపై ప్రయాణిస్తుండగా చవటపల్లి వద్ద నిలిపి ఉన్న లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

అదేవిధంగా ప్రమాద సమయంలో కారులో ఉన్న మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి (Chittoor Government Hospital)కి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. లారీ కిందకు కారు దూసుకుపోవడంతో ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. లోపల చిక్కుకున్న వారిని స్థానికులు, పోలీసులు ఎంతో శ్రమించి బయటకు తీశారు. ఘటనపై సమాచారం అందుకున్న పూతలపట్టు పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు లేదా అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story