- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెట్లు నాటే కూలీలపైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురికి తీవ్ర గాయాలు
గండీడ్ మండలంలోని కొంరెడ్డిపల్లి–అంచన్ పల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారి–167 పై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

దిశ,గండీడ్: గండీడ్ మండలంలోని కొంరెడ్డిపల్లి–అంచన్ పల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారి–167 పై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన చెట్లను నాటుతున్న కూలీలపైకి ఓ కారు అదుపుతప్పి దూసుకెళ్లడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం, వరంగల్ జిల్లాకు చెందిన కూలీలు జాతీయ రహదారి వెంట మొక్కలు నాటే పనులు నిర్వహిస్తుండగా, కొంరెడ్డిపల్లి వైపు నుంచి వచ్చిన ఓ కారు అజాగ్రత్తగా అదుపుతప్పి పనులు చేస్తున్న కూలీలను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలాజీ నాయక్, విజయ్ నాయక్, విజ్జు బాయిలకు కాళ్లు, చేతులు, నడుము భాగాల్లో తీవ్ర గాయాలై ఎముకలు విరిగినట్లు సమాచారం. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి, క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






