HYD: కాచిగూడ రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద కారు కలకలం

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-13 16:12:28  IST  )

హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్(Kacheguda Railway Station) సమీపంలో ట్రాక్‌పై కారు కలకలం రేపింది.

HYD: కాచిగూడ రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద కారు కలకలం
X

దిశ, అంబర్‌పేట: హైదరాబాద్‌లోని కాచిగూడ నింబోలి అడ్డ వద్ద రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ కింద గురువారం సాయంత్రం ఓ కారు రోడ్డుకు అడ్డంగా పార్క్‌ చేయడంతో కలకలం చెలరేగింది. సాయంత్రం సుమారు 7.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి TS 11 UA 7868 నంబర్‌ ఉన్న బూడిదరంగు కారును రోడ్డుకు అడ్డంగా నిలిపి వెళ్లిపోయాడు. స్థానికులు అనుమానంతో వెంటనే కాచిగూడ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎవరినీ కారు దగ్గరకు అనుమతించలేదు. కారులో పేలుడు పదార్థాలు ఉండొచ్చన్న అనుమానంతో బాంబ్‌ స్క్వాడ్‌ను పిలిపించారు. బాంబ్‌ స్క్వాడ్‌ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేసి, కారులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించారు. అనంతరం పోలీసులు కారును అక్కడి నుంచి తొలగించారు. ఈ ఘటన కారణంగా కొంతసేపు రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కాచిగూడ పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.

Next Story