- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ముగ్గురు స్పాట్ డెడ్, 11 మందికి గాయాలు
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

X
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం పాలైన విషాద ఘటన మంచిర్యాల (Manchiryala) జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జైపూర్ (Jaipur) మండల పరిధిలోని ఇందారం (Indaram) వద్ద జాతీయ రహదారి 363పై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి అతివేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మొత్తం ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స సమీప నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. అయితే, మృతులు మహారాష్ట్రకు చెందిన కూలీలుగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






