- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు యువకులు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో (Road Accident) ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లాలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్/సత్తుపల్లి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండల పరిధిలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. ఐదుగురు యువకులు కలిసి కారులో వెళుతుండగా కిష్టారం అంబేద్కర్ నగర్ సమీపంలో అతివేగంతో అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలోని మహబాద్ నగర్‌కు చెందిన ఎస్‌డీ షాజీత్ (21), సత్తుపల్లి మండలం కొమ్మెపల్లి గ్రామానికి చెందిన సిద్దేసి జాయ్ (21), మర్సకట్ల శశివర్ధన్ (12) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అదేవిధంగా అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన తలారి అజయ్, మహబాద్ నగర్‌కు చెందిన షేక్ ఇమ్రాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా, వారు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. కారులో ఉన్నవారి మృతదేహాలు 50 మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






