- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైకును ఢీకొన్న కారు.. ఒకరు స్పాట్ డెడ్
డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకోగా, మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన మండలంలోని వెంకట్రావుపేట గేటు వద్ద గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

దిశ, కౌడిపల్లి: డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకోగా, మరో వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన మండలంలోని వెంకట్రావుపేట గేటు వద్ద గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఎస్ఐ అమరేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నర్సాపూర్ మండలం అహ్మద్‌నగర్ గ్రామానికి చెందిన చింతకుంట మల్లేశం వ్యక్తిగత పనిమీద ముట్రాజ్‌పల్లికి వెళ్లి తిరిగి బైక్‌పై వస్తున్నాడు. వెంకట్రావుపేట గేటు వద్ద మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారిని దాటుతుండగా నర్సాపూర్ వైపు నుంచి మెదక్ దిశగా వెళ్తున్న కారు (TS 21B 9112) అతివేగంగా వచ్చి మల్లేశంను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మల్లేశం అక్కడికక్కడే మృతి చెందాడు. అదే కారు అదుపుతప్పి మెదక్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న వెంకట్రావుపేట గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ డప్పు కుమార్‌ను కూడా బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు కాళ్లు, చేతులు విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు 108 అంబులెన్స్‌లో నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన కుశాంత్‌గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు మల్లేశం భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అమరేందర్ రెడ్డి వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన వాహనం మెదక్ కలెక్టరేట్‌లో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారిణికి చెందిన కారుగా గుర్తించారు.






