600 అడుగుల లోయలో పడిన కారు.. ఆరుగురు దుర్మరణం

by Naga Rani Yarlagadda |

కారు అదుపుతప్పి 600 అడుగుల లోయలో పడటంతో.. ఆరుగురు దుర్మరణం చెందారు.

600 అడుగుల లోయలో పడిన కారు.. ఆరుగురు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: కారు అదుపుతప్పి 600 అడుగుల లోయలో పడటంతో.. ఆరుగురు దుర్మరణం చెందారు. ఈ ఘోర ప్రమాదం మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాశిక్ లోని సప్తశృంగి గఢ్ ఘాట్ రోడ్డులో కారు అదుపుతప్పి 600 అడుగుల లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులను నిఫాడ్ లోని పింపల్ గావ్ బస్వంత్ గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. ప్రమాదంలో వాహనం పూర్తిగా ధ్వంసమైందని తెలిపారు. ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

Next Story