అనుమాన‌స్ప‌ద స్థితిలో కారు డ్రైవ‌ర్ మృతి

by Ratna Kumari |

అనుమాన‌స్ప‌ద స్థితిలో కారు డ్రైవ‌ర్ మృతి చెందిన సంఘ‌ట‌న ఆదివారం తొర్రూర్ లో చోటు చేసుకుంది

అనుమాన‌స్ప‌ద స్థితిలో కారు డ్రైవ‌ర్ మృతి
X

దిశ‌, తొర్రూర్ : అనుమాన‌స్ప‌ద స్థితిలో కారు డ్రైవ‌ర్ మృతి చెందిన సంఘ‌ట‌న ఆదివారం తొర్రూర్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. తొర్రూర్ ప‌ట్ట‌ణానికి చెందిన రామ‌గిరి ర‌వి శంక‌ర్ (30) అనుమాన‌స్ప‌ద స్థితిలో మృతి చెందాడు. గ‌త ప‌దిరోజుల కింద‌ట జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ర‌విశంక‌ర్ కాలు విర‌గ‌డంతో పాటు త‌ల‌కు తీవ్ర గాయాల‌య్యాయి. ఈ ప్ర‌మాదం త‌రువాత చికిత్స పొందాడు. ప్ర‌స్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆదివారం ఉద‌యం ర‌విశంక‌ర్ మృతి చెందిన‌ట్టు కుటుంబ స‌భ్యులు గుర్తించారు. ఈ ప్ర‌మాదంలో జ‌రిగిన గాయాల ప్ర‌భావ‌మా..? లేక ఇత‌ర ఆరోగ్య కార‌ణాల వ‌ల్ల మృతి చెందాడా..? అని అనుమానిస్తున్నారు. ఇత‌ని మృతి పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తొర్రూరు ఎస్సై మహేందర్ రెడ్డి తెలిపారు. మృతికి గల కారణాలు పోస్టుమార్టం నివేదిక అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

Next Story