- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fire Accident : ఉప్పల్ రింగు రోడ్డులో తగలబడిన కారు.. భారీగా ట్రాఫిక్ జాం
హైదరాబాద్(Hyderabad) నగరంలోని ఉప్పల్ రింగ్ రోడ్డు(Uppal Ring Road)లో భారీ ప్రమాదం తృటిలో తప్పింది.

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరంలోని ఉప్పల్ రింగ్ రోడ్డు(Uppal Ring Road)లో భారీ ప్రమాదం తృటిలో తప్పింది. నాగోలు నుంచి తార్నాక వైపు వెళ్తున్న కారు ఇంజిన్లో నుంచి పొగలు రావడంతో అందులో ఉన్నవారు భయపడి కిందిగి దిగారు. అసలేం జరిగిందో చూద్దాం అనుకునే లోపే కారులో ఒక్కసారిగా మంటలు రేగి.. కారు మొత్తం కాలి బూడిద(Fire Accident) అయింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికీ అప్పటికే కారు పూర్తిగా కాలిపోయింది. అయితే నగరంలోనే అత్యంత రద్దీ రూట్ అయిన ఉప్పల్ రింగ్ రోడ్ మధ్యలో ఈ ప్రమాదం జరగడంతో భారీగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈరోజు ఆదివారం ట్రాఫిక్ మరింత పెరిగింది. దాదాపు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోవడంతో.. వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. 3 గంటలపాటు కష్టపడి ట్రాఫిక్ ను అదుపులోకి తెచ్చారు ట్రాఫిక్ పోలీసులు.






