అదుపు తప్పి కారు బోల్తా.. ఒకరు మృతి

by Bhanu |

సోమశిల పర్యటనకు వెళ్లిన నలుగురు యువకుల సంతోషయాత్ర విషాదంగా ముగిసింది.

అదుపు తప్పి కారు బోల్తా.. ఒకరు మృతి
X

దిశ, పెద్ద కొత్తపల్లి: సోమశిల పర్యటనకు వెళ్లిన నలుగురు యువకుల సంతోషయాత్ర విషాదంగా ముగిసింది. దేవరకద్ర మండలానికి చెందిన నలుగురు యువకులు బుధవారం సాయంత్రం కారులో సోమశిల పర్యాటక ప్రదేశం వైపు వెళ్తుండగా పెద్ద కొత్తపల్లి మండలంలోని వావిళ్లబావి గ్రామ సమీపంలో వారి కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయాలపాలైన వారిలో దుబ్బల శ్రీధర్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాదు తరలించేందుకు ప్రయత్నించారు.


ఈ కారు ప్రమాదంలో భూత్పూర్‌కు చెందిన హర్షవర్ధన్ రెడ్డి, తుమ్మల రాఘవేందర్, దుబ్బల హరిప్రసాద్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పెద్దకొత్తపల్లి ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story