సినిమా స్టోరీని మించిన ట్విస్ట్.. స్మగ్లర్లను పట్టించిన చిన్న ప్రమాదం

by Bhoopathi Nagaiah |

గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న కేటుగాళ్ల బండారం ఓ చిన్న యాక్సిడెంట్‌తో బట్టబయలు అయింది.

సినిమా స్టోరీని మించిన ట్విస్ట్.. స్మగ్లర్లను పట్టించిన చిన్న ప్రమాదం
X

దిశ, చిత్తూరు: గుట్టుచప్పుడు కాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న కేటుగాళ్ల బండారం ఓ చిన్న యాక్సిడెంట్‌తో బట్టబయలు అయింది. పోటీసుల కళ్లుగప్పి ఎవరికీ అనుమానం రాకుండా కారులో రెడ్ శ్యాండిల్‌ను తరలిస్తుండగా అనూహ్యంగా చట్టానికి చిక్కారు. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడగా, నిందితులు సినీ పక్కీలో తప్పించుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బెంగళూరు- చిత్తూరు జాతీయ రహదారిపై బంగారుపాళెం మండలం, కాటప్పగారిపల్లె రోడ్డు సమీపంలో పలమనేరు ప్రాంతం నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారులో కొందరు తొమ్మిది ఎర్రచందనం దుంగలు తీసుకుని వెళుతుండగా డివైడరును ఢీ కొని పక్కకు దూసుకెళ్లింది. ఇదే సమయంలో కొరివారిపల్లి నుంచి బంగారుపాళ్యం వైపు ద్విచక్రవాహనంలో వెళుతున్న వెంకటస్వామిని ఈ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో అతడు గాయపడ్డాడు. కారు రోడ్డు పక్కన లోయలో పడడంతో స్మగ్లర్లు ఆ వాహనం వదలి పరారీ అయ్యారు. ఈ ఘటన స్థలానికి చేరుకున్న బంగారుపాళెం పోలీసులు ద్విచక్ర వాహనం, కారు, ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Next Story