- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదర్గూడలో కారు బీభత్సం..
by Batti.Sumithra |
రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్ గూడ లో ఓ కారు బీభత్సం సృష్టించింది.

X
దిశ, రాజేంద్రనగర్ : రాజేంద్రనగర్ సర్కిల్ హైదర్ గూడ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వచ్చిన కారు ఓ ఆప్టికల్ షాప్ లోపలికి దూసుకెళ్లింది. షాప్ ముందు పార్క్ చేసిన మోటర్ సైకిల్ ను ఢీకొట్టి దూసుకెళ్లడంతో ఓ ఆప్టికల్ షాప్ తో పాటు మరో షాపు ధ్వంసమయ్యాయి. రోడ్డు పై ఎవ్వరూ లేకపోవడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది.
ఎవరికి ఏమి కాకపోవటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనతో స్థానికులు కారు డ్రైవర్ పై దాడి చేసేందుకు ప్రయత్నించగా డ్రైవర్ కారు వదిలిపెట్టి పరారయ్యాడు. మితిమీరిన వేగంతో దూసుకు వచ్చిన కారణంగానే కారు అదుపు తప్పి షాప్ లోకి దూకుకెళ్ళిందని స్థానికులు చెబుతున్నారు. కారు నడిపిన యువకుడు ఈ మధ్యకాలంలోనే విదేశాల నుండి వచ్చినట్టు సమాచారం.
Next Story






