Cannabis Seize: నగరంలో పోలీసుల తనిఖీలు.. విదేశీ గంజాయి సీజ్, ఒకరు అరెస్ట్

by Kema Shiva Kumar |

తెలంగాణ (Telangana)లో డ్రగ్స్ (Drugs) వినియోగం పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

Cannabis Seize: నగరంలో పోలీసుల తనిఖీలు.. విదేశీ గంజాయి సీజ్, ఒకరు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో డ్రగ్స్ (Drugs) వినియోగం పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్‌ ఫ్రీ స్టేట్‌ (Drugs Free State)గా చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు డ్రగ్స్ విక్రయిస్తూ.. ఎవరైనా పట్టుబడిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ పోలీసు శాఖ (Police Department)కు ఆదేశాలను జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే టాస్క్‌ఫోర్స్ (Taskforce), ఎస్‌ఓటీ (SOT), ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు (Railway Stations), ఎయిర్‌పోర్టు (Airports)లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతూ.. ఎక్కడికక్కడ గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు నమోదు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆదివారం ఆర్ధరాత్రి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ (Rachakonda Police Commissionerate) పరిధిలోని గచ్చిబౌలి (Gachibowli)లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా 170 గ్రాముల విదేశీ గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శివరామ్ (Shiva Ram) అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మరో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అజయ్ (Ajay) కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే, ఏకంగా అమెరికా (America) నుంచి హైదరాబాద్‌ (Hyderabad)కు గంజాయి దగుమతి చేసుకుని దందా చేస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

Next Story