- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంజాయి ముఠా పట్టివేత.. ముగ్గురి అరెస్టు.. ఒకరు పరారీ..
గంజాయి మత్తుకు బానిసలైన ముగ్గురు యువకులు ఆ గంజాయిని ఇతరులకు విక్రయించబోయి కోదాడ పట్టణ పోలీసుల చేతికి సోమవారం చిక్కి కటకటాల పాలయ్యారు.

దిశ, కోదాడ: గంజాయి మత్తుకు బానిసలైన ముగ్గురు యువకులు ఆ గంజాయిని ఇతరులకు విక్రయించబోయి కోదాడ పట్టణ పోలీసుల చేతికి సోమవారం చిక్కి కటకటాల పాలయ్యారు. సిఐ శివశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలంలోని కాపుగల్లుకు చెందిన షేక్ సలీం, మాళోత్ సాయి కుమార్ కలిసి అదే గ్రామంలోని ఓ రైస్ మిల్ లో పని చేసే బీహార్ కు చెందిన సందీప్ నుంచి గంజాయి కొనుగోలు చేసి సిగరెట్ రూపంలో తాగేవారు. వారికి కోదాడలో తమలపాకుల సిద్దు పరిచయమయ్యాడు.
సాయి కుమార్, సిద్దు గంజాయిని తాము తాగడంతో పాటు పట్టణంలో విక్రయించి సొమ్ము చేసుకుందామనున్నారు. ఈ క్రమంలో సందీప్ నుంచి అర కిలో గంజాయిని కొనుగోలు చేసి చిన్న, చిన్న పాకెట్లుగా మార్చారు. సోమవారం నిందితులిద్దరూ ఆ పాకెట్లతో కోదాడ సమీపంలోని దుర్గాపురం క్రాస్ రోడ్ దగ్గర దిగి మరో నిందితుడు సిద్దుతో కలిసి దగ్గరలోనే ఉన్న మామిడితోటలోకి వెళ్లారు.
గమనించిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. బీహార్ వాసి సందీప్ పరారీలో ఉన్నాడు. దొరికిన సలీం, సిద్దు, సాయి కుమార్ ను అరెస్ట్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.5 వేలు ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఎస్సై లింగయ్య, కానిస్టేబుళ్లు రాంబాబు, ఫరీద్, చారి, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు






