ఘోర రోడ్డుప్రమాదం.. 10 మంది మృతి, మరో 24 మందికి గాయాలు

by Naga Rani Yarlagadda |

పంజాబ్ లోని హోషియార్ పూర్ జిల్లాలోని దసుయా - హాజీపూర్ రోడ్డులో సాగ్రా అడ్డా సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది.

ఘోర రోడ్డుప్రమాదం.. 10 మంది మృతి, మరో 24 మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్ లోని హోషియార్ పూర్ జిల్లాలోని దసుయా - హాజీపూర్ రోడ్డులో సాగ్రా అడ్డా సమీపంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. దాసుయా సబ్ డివిజన్ మీదుగా వెళ్తుండగా.. డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 10 మంది మరణించినట్లు తెలుస్తోంది. మరో 24 మందికి గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని తక్షణ సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను దసుయా సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో మరణించిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story