- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bus Fire: ఆర్టీసీ బస్సులో మంటలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
ఆర్టీసీ (RTC) బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన ఘటన తిరుపతి (Tirupati) జిల్లాలో చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆర్టీసీ (RTC) బస్సులో ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగిన ఘటన తిరుపతి (Tirupati) జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సుమారు 29 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు నాయుడుపేట (Nayudupeta) సమీపంలోని విన్నమాల (Vinnamala) జాతీయ రహదారి వద్దకు చేరుకుంది. అనంతరం బస్సు లోపల నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు ఆందోళనకు గురై కేకలు వేశారు. ప్రయాణికుల కేకలతో తక్షణమే స్పందించిన డ్రైవర్, బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. మంటలు బస్సు మొత్తం వ్యాపించక ముందే ప్రయాణికులందరినీ హుటాహుటిన కిందకు దించేశారు. ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు తీవ్రమయ్యాయి. బస్సులో షార్ట్ సర్క్యూట్ సంభవించడం వల్లే ఈ మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. సమయానికి బస్సును ఆపి ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో పెను ప్రాణనష్టం తప్పిందని, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.






