- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నదిలో పడిపోయిన బస్సు.. ఒకరి మృతి, 11 మంది గల్లంతు
నదిలో బస్సు పడిపోయిన ఘటన ఉత్తరఖండ్ రాష్ట్రంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: నదిలో బస్సు పడిపోయిన భయానక ఘటన ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రుద్రప్రయాగ్ జిల్లాలో ఘెల్తిర్ ప్రాంతంలో రిషికేశ్-బద్రీనాథ్ హైవేపై 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి పక్కనే ఉన్న అలకనంద నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 11 మంది ప్రయాణికులు నది ఉధృతికి కొట్టుకుపోయారు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు స్పందన బలగం (SDRF)తో స్పాట్‌కు వెళ్లి గల్లంతైన వారిని గాలించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. డ్రైవర్ తప్పిదం కారణంగా ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.






