- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం.. డోర్ లో నుంచి జారిపడి ప్యాసింజర్ దుర్మరణం
వామిట్ వస్తుందని... బస్సు ను సైడ్ కు ఆపాలని డ్రైవర్ ను ప్యాసింజర్ రిక్వెస్ట్ చేయగా,

దిశ భిక్కనూరు : వామిట్ వస్తుందని... బస్సు ను సైడ్ కు ఆపాలని డ్రైవర్ ను ప్యాసింజర్ రిక్వెస్ట్ చేయగా, బస్సు ఆపకుండా డోర్ ను ఓపెన్ చేయడం వలన ప్రమాదవశాత్తు జారి కింద పడిపోయి ప్యాసింజర్ మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.... ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన అంచెట్టి స్వామి (42) బట్టల షాపులో వర్కర్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. హైదరాబాద్ లో పని ఉండడంతో అక్కడ పనులు ముగించుకొని హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో తన భార్య మమత తో కలిసి ఎక్కాడు.
అయితే కడుపులో తిప్పినట్లు కావడం, వామిట్ వచ్చినట్టు అవుతుండడంతో, డ్రైవర్ వద్దకు వెళ్లి బస్సును సైడ్ కు ఆపాలని రెక్వెస్ట్ చేశాడు. అయితే బస్సు డ్రైవర్ ఆపకుండానే బస్సును డ్రైవ్ చేస్తూ డోర్ ఓపెన్ చేశాడు. దీంతో వాంటింగ్ చేసేందుకు తల బయటకు పెట్టిన స్వామి ప్రమాదవశాత్తు జారి కింద పడగా, బస్సు వెనకాల టైర్లు స్వామి నడుము పై నుంచి వెళ్లగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలోని మార్చురీకి షిఫ్ట్ చేసినట్లు ఎస్ఐ ఆంజనేయులు వివరించారు.
Read More... మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదం.. 35 మందికి గాయాలు(VIDEO)






