కాంక్రీట్ నిర్మాణాన్ని ఢీకొన్న బస్సు.. స్పాట్‌లో 15 మంది దుర్మరణం!

by Kema Shiva Kumar |

రోడ్డు ప్రమాదంలో 15 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన ఇండోనేషియా (Indonesia)లోని సెంట్రల్ జావా (Central Java) ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది.

కాంక్రీట్ నిర్మాణాన్ని ఢీకొన్న బస్సు.. స్పాట్‌లో 15 మంది దుర్మరణం!
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదంలో 15 మంది దుర్మరణం పాలైన విషాద ఘటన ఇండోనేషియా (Indonesia)లోని సెంట్రల్ జావా (Central Java) ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. జకార్తా నుంచి యోగ్యకర్తకు వెళ్తున్న కహాయా ట్రాన్స్‌పోర్టు (Kahaya Transport) సంస్థకు చెందిన బస్సు టోల్ రోడ్డు మీద అదుపు తప్పింది. అనంతరం క్రాప్యాక్ టోల్ గేట్ ఎగ్జిట్ వద్ద ఉన్న పెద్ద కాంక్రీట్ దిమ్మను బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రమాద సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉండగా.. అందులో 15 మంది స్పాట్‌లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 19 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని సెమారాంగ్‌లోని RSUP డాక్టర్ కరియాది ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్‌మార్టంకు ప్రత్యేక వాహనాల్లో స్థానిక ఆసుపత్రికి తరలించారు.

ఈ క్రమంలోనే సెమారాంగ్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ బుదియోనో మాట్లాడుతూ.. బస్సు అధిక వేగంతో ప్రయాణిస్తూ అదుపు తప్పిందని తెలిపారు. ఇందుకు గల కారణాలు త్వరలోనే దర్యాప్తులో బయటపడతాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు.

Next Story