- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kurnool Bus Accident: రాష్ట్రాలవారీగా ప్రయాణికుల వివరాలు
కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం(Bus Accident Kurnool) జరిగిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ఘోర బస్సు ప్రమాదం(Bus Accident Kurnool) జరిగిన సంగతి తెలిసిందే. బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి పైగా మృతిచెందారు. మరికొందరు తీవ్రం గాయాలపాలై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తాజాగా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన వారి పూర్తి వివరాలు, వారు చికిత్స పొందుతున్న ఆసుపత్రి వివరాలను అధికారులు విడుదల చేశారు.
సురక్షితంగా బయటపడిన ప్రయాణికుల వివరాలు :
1. మన్నెంపల్లి సత్యనారాయణ (వయసు 27), తండ్రి ఎం. రవి, సత్తుపల్లి, ఖమ్మం జిల్లా – గాయపడి ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
2. బడంత్ర జయసూర్య (వయసు 24), తండ్రి సుబ్బరాయుడు, మియాపూర్, హైదరాబాద్ – గాయపడి కర్నూలు GGH లో చికిత్స పొందుతున్నారు.
3. అండోజ్ నవీన్ కుమార్ (వయసు 26), తండ్రి కృష్ణాచారి, హయత్‌నగర్, హైదరాబాద్ – గాయపడి చికిత్సలో ఉన్నారు.
4. సరస్వతి హారిక (వయసు 30), తండ్రి రంగరాజు, బెంగళూరు – కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలో ఉన్నారు.
5. నెలకుర్తి రమేష్ (వయసు 36), దత్తలూరు మండలం, నెల్లూరు జిల్లా – స్వల్ప గాయాలు, ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు.
6. శ్రీలక్ష్మి (నెలకుర్తి రమేష్ భార్య), జస్విత (వయసు 8), అభీరా (వయసు 1.8 సంవత్సరాలు) – ముగ్గురు సురక్షితంగా కర్నూలులో బంధువుల వద్ద ఉన్నారు.
7. కపర్ అశోక్ (వయసు 27), తెలంగాణ రాష్ట్రం – సురక్షితంగా హైదరాబాద్‌కి వెళ్తున్నారు.
8. ముసలూరి శ్రీహర్ష (వయసు 25), నెల్లూరు జిల్లా – గాయపడి కర్నూలు GGH లో చికిత్స పొందుతున్నారు.
9. పునుపట్టి కీర్తి (వయసు 28), ఎస్.ఆర్. నగర్, హైదరాబాద్ – చికిత్స అనంతరం ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యి హైదరాబాద్ చేరుకున్నారు.
10. వేణుగోపాల్ రెడ్డి (వయసు 24), తెలంగాణ రాష్ట్రం – చికిత్స అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు.
11. ఎం.జి.రామరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా – చికిత్స పూర్తయి హైదరాబాద్ చేరుకున్నారు.
12. ఘంటసాల సుబ్రమణ్యం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్ – ఆకాశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
13. అశ్విన్ రెడ్డి – ఎటువంటి గాయాలు లేవు, సంఘటనా స్థలంలో సురక్షితంగా ఉన్నారు.
14. ఆకాశ్ – ఎటువంటి గాయాలు లేవు, సురక్షితంగా ఉన్నారు.
15. జయంత్ కుశ్వాల్, మధ్యప్రదేశ్ (హైదరాబాద్‌లో పనిచేస్తున్నారు) – సురక్షితంగా ఉన్నారు.
16. పంకజ్ ప్రజాపతి – ఎటువంటి గాయాలు లేవు, సురక్షితంగా ఉన్నారు.
17. గుణ సాయి, తూర్పు గోదావరి జిల్లా – స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నారు.
18. శివా (గణేష్ కుమారుడు) – ఎటువంటి గాయాలు లేవు, బెంగళూరు చేరుకున్నారు.
19. గ్లోరియా ఎల్సా సామ్, బెంగళూరు – ఎటువంటి గాయాలు లేవు, బెంగళూరు చేరుకున్నారు.
20. చారిత్ (వయసు 21), బెంగళూరు – సురక్షితంగా బెంగళూరు చేరుకున్నారు.
21. మొహమ్మద్ ఖిజర్ (వయసు 51), బెంగళూరు – సురక్షితంగా బెంగళూరు చేరుకున్నారు.
22. తరుణ్ (వయసు 27) – బస్సులో ఎక్కకముందే రద్దు చేసుకున్నారు.
డ్రైవర్ల వివరాలు :
1. లక్ష్మయ్య, పల్నాడు జిల్లా – ప్రధాన డ్రైవర్. సంఘటన సమయంలో బస్సు నడుపుతున్నారు. ప్రమాదం తర్వాత అబ్స్కాండ్ అయ్యారు (సంఘటన స్థలం నుండి పరారయ్యారు).
2. శివనారాయణ, ప్రకాశం జిల్లా – స్పేర్ డ్రైవర్. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు మరియు విచారణ కొనసాగుతోంది.
ప్రయాణికుల రాష్ట్రాలవారీగా:
• తెలంగాణ రాష్ట్రం – 6
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం – 11
• మధ్యప్రదేశ్ – 1
• కర్ణాటక రాష్ట్రం – 4
మరో ముగ్గురు ఏ రాష్ట్రానికి చెందినవారు తెలియాల్సి ఉంది.






