Road Accident: డంపర్ ను ఢీ కొట్టిన బస్సు.. ఐదుగురు స్పాట్ డెడ్

by Naga Rani Yarlagadda |

ఆగ్రా - లక్నో ఎక్స్ ప్రెస్ వే పై ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు.

Road Accident: డంపర్ ను ఢీ కొట్టిన బస్సు.. ఐదుగురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్ లో (Uttar Pradesh Accident) శనివారం తెల్లవారుజామున ఘోరప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు.. డంపర్ వెహికల్ ను ఢీ కొట్టింది. ఫిరోజాబాద్ (Firozabad District)జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. కాగా.. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోలోని మొహద్దిన్ పూర్ కు కు చెందిన సందీప్ కుటుంబం.. తమ నాలుగేళ్ల కొడుకు సిద్ధార్థ్ పుట్టు వెంట్రుకల మొక్కును తీర్చుకుని తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆగ్రా - లక్నో ఎక్స్ ప్రెస్ వే (Agra-Lucknow Expressway) పైన వెళ్తున్న బస్సుపై.. డ్రైవర్ పట్టుకోల్పోవడంతో ప్రమాదం జరిగినట్లు బస్సులో ఉన్న ప్రయాణికులు తెలిపారు. ప్రమాదంలో గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో సందీప్ భార్య నీతు (42), కూతురు లవ్షిక (13), పెద్ద కొడుకు నైతిక్ (15) మరణించగా.. గీత (42), హృతిక్ (12), కార్తీక్ (9), ప్రాన్షు (13), సంజీవన్ (43), సుషీల్ కుమార్ (30), శశిదేవి (44), చాంచాం (4), సావిత్రీ దేవి (41), ఆరోహి (17 నెలలు), రియా (16), పూనమ్ (29), పూల్మతి (40), సారిక (13), రూబీ (29) లకు గాయాలయ్యాయని, వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Next Story