ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కు నేను సరైన స్టూడెంట్ కాదు.. సూసైడ్ లెటర్ రాసి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

by Ajay Maddhiboyina |

ఈ ఎడ్యుకేష‌న్ సిస్ట‌మ్‌కు నేను సరైన విద్యార్థిని కాదు అని సూసైడ్ నోటి రాసి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. 24ఏళ్ల శివమ్ అనే బీటెక్ విద్యార్థి గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీటెక్ చదువుతున్నాడు.

ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్‌కు నేను సరైన స్టూడెంట్ కాదు.. సూసైడ్ లెటర్ రాసి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
X

దిశ‌, వెబ్ డెస్క్: ఈ ఎడ్యుకేష‌న్ సిస్ట‌మ్‌కు నేను సరైన విద్యార్థిని కాదు అని సూసైడ్ నోటి రాసి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. 24ఏళ్ల శివమ్ అనే బీటెక్ విద్యార్థి గ్రేటర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీటెక్ చదువుతున్నాడు. ఏమైందో కానీ ఆ విద్యార్థి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతరం గదిలో దొరికిన సూసైడ్ నోట్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ పై ఎంతో ఆవేదన వ్యక్తం చేశాడు. లెటర్ లో... "మీరు లెటర్ చదివే సమయానికి నేను చనిపోయి ఉంటాను.

నా చావు నా నిర్ణయమే. నా చావుకు నేనే కారణం ఎవ్వరికీ దీనితో సంబంధం లేదు. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ కు నేను సరైన విద్యార్థిని కాను. ఎప్పటికీ కాలేను కూడా. ఈ దేశం గొప్పగా ఉండాలంటే మొదట అసలైన ఎడ్యుకేషన్ సిస్టమ్ ను తీసుకురండి." అని పేర్కొన్నాడు. అంతే కాకుండా తాను అసలు సెకండ్ ఇయర్ తరవాత అసలు తాను కాలేజీకే వెళ్లలేదని కాబట్టి తన ఫీజును కుటుంబ సభ్యులకు రిఫండ్ చేయాలని కోరాడు. తాను ఏడాది క్రితం నుండే ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నానని, ఈ ఒత్తిడి తట్టుకోవడం తన వల్ల కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన డెడ్ బాడీని మెడికల్ కాలేజీకి డొనేట్ చేయాలని తల్లిదండ్రులకు సూచించాడు.

Next Story