- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హాస్టల్ భవనంపై నుండి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
మద్యం మత్తులో నాలుగో అంతస్తు నుండి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. ఝూన్సీ జిల్లాకు చెందిన ఉదిత్ సోని అనే విద్యార్థి నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: మద్యం మత్తులో నాలుగో అంతస్తు నుండి దూకి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. ఝూన్సీ జిల్లాకు చెందిన ఉదిత్ సోని అనే విద్యార్థి నోయిడాలోని నాలెడ్జ్ పార్క్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కాగా అతడు శుక్రవారం రాత్రి ఫుల్లుగా మద్యం సేవింది శనివారం తెల్లవారుజామున తిరిగి హాస్టల్ కు చేరుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న ఉదిత్ ప్రవర్తనను హాస్టల్ యాజమాన్యం చిత్రీకరించి అతడి తండ్రికి వీడియోను పంపింది.
వీడియోను చూసిన తండ్రి కుమారుడిని మందలించి, కాలేజీ మాన్పించేస్తానని హెచ్చరించాడు. మరోవైపు హాస్టల్ యాజమాన్యం సైతం విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో తీవ్రమనస్థాపం చెందిన ఉదిత్ నాలుగో అంతస్తు నుండి దూకేశాడు. తీవ్రగాయాలపాలైన ఉదిత్ ను వెంటనే ఆస్పత్రికి తరలించగా మరణించినట్టు వైద్యులు నిర్దారించారు. కాగా ఉదిత్ పై యాజమాన్యం అనుచితంగా ప్రవర్తించిందని కాలేజీ విద్యార్థులు హాస్టల్ భవనం ముందు ధర్నాకు దిగారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






