- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యాపీఠంలోనూ వివాహితకు రక్షణ కరువు..
కాలినడకన వెళుతూ ఒక పుణ్య ప్రదేశంలో బస చేసేందుకు వచ్చిన వివాహిత పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

దిశ, సంగారెడ్డి అర్బన్ : కాలినడకన వెళుతూ ఒక పుణ్య ప్రదేశంలో బస చేసేందుకు వచ్చిన వివాహిత పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గొల్ల కుంట గ్రామానికి చెందిన దంపతులు ఈ నెల 14వ తేదీన సంత్ సేవాలాల్ గుడికి కాలినడకన వెళ్లి తిరుగు ప్రయాణంలో రాత్రి జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో బస చేశారు.
గుడి నిర్మాణం దశలో ఉన్న నేపథ్యంలో అదే రోజు అర్ధరాత్రి అక్కడ పెయింటర్ గా పనిచేస్తున్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన మాధవన్ (34) విద్యాపీఠంలో సేదతీరుతున్న ఆ వివాహితపై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని నిందితుడని రిమాండ్ కు తరలించడం జరిగిందని సంగారెడ్డి రూరల్ ఎస్సై రవీందర్ తెలిపారు.






