- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Brutal Murder: గంజాయికి బానిసైన కొడుకు.. గొడ్డలితో నరికి చంపిన తండ్రి
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్న కొడుకు చెడు వ్యసనాలకు బానిసయ్యాడన్న ఆవేదనతో ఓ తండ్రి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. గంజాయికి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడన్న కోపంతో తన 23 ఏళ్ల కుమారుడిని గొడ్డలితో నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. ఇందల్వాయి (Indalwai) మండల పరిధిలోని నల్లవెల్లి (Nalavelli) గ్రామానికి చెందిన కొత్తగొల్ల కిషన్ కుమారుడు గత కొంతకాలంగా గంజాయికి అలవాటు పడ్డాడు. చెడు వ్యసనాల వల్ల ఇంట్లో నిత్యం గొడవులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కుమారుడి ప్రవర్తనతో విసిగిపోయిన కిషన్, ఇవాళ ఉదయం క్షణికావేశంలో కుమారుడిపై గొడ్డలితో దాడి చేసి ప్రాణాలు తీశాడు.
పోలీస్ స్టేషన్‌లో సరెండర్..
కుమారుడిని హతమార్చిన అనంతరం నిందితుడు కొత్తగొల్ల కిషన్ (Kothagolla Kishan) నేరుగా ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తాను చేసిన పనిని పోలీసులకు వివరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.






