- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- ఎన్ఆర్ఐ - NRI
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
జగిత్యాల జిల్లాలో యువకుడి దారుణ హత్య
దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో నన్నపనేని విద్యాసాగర్ (32) అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం సాయంత్రం తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న విద్యాసాగర్ ను చూసిన స్థానికులు 108 కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది అప్పటికే మృతి చెందినట్లుగా నిర్ధారించారు. అయితే కుటుంబ తగాదాల నేపథ్యంలో కన్నతండి, తమ్ముడు కలిసి హత్యకు పాల్పడినట్లుగా గ్రామస్తులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు విద్యాసాగర్ రెండేళ్ల క్రితం గల్ఫ్ నుండి వచ్చాడు. అప్పటి నుండి ఏ పనీ చేయకుండా అప్పులు చేస్తూ మద్యానికి బానిస అయ్యాడు. ఇటీవల తన పేరున వ్యవసాయ భూమి మార్చాలని తరచూ కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నట్లుగా సమాచారం. కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా మారకపోవడంతోనే ఈ హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుడి తండ్రి రమేష్, సోదరుడు విక్రమ్ తో పాటు కుటుంబ సభ్యులు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.
- Tags
- murder