- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహేతర సంబంధం కోసం అమానుషంగా చిన్నారి హత్య
అమ్మ ఒడిలో ఒదిగిపోవాల్సిన ఆ పసి వాడు, లోకమంటే తెలియని వయసులో అనంత లోకాలకు వెల్లిపోయాడు. చిన్నారి శ్రావణ్ చిరునవ్వులు ఆ ఇంట్లో వెలుగులు నింపాల్సింది పోయి, విధి ఆడిన వింత నాటకంలో ఆ పసి మొగ్గ అన్యాయంగా రాలిపోయింది.

దిశ, కామారెడ్డి రూరల్ : అమ్మ ఒడిలో ఒదిగిపోవాల్సిన ఆ పసి వాడు, లోకమంటే తెలియని వయసులో అనంత లోకాలకు వెల్లిపోయాడు. చిన్నారి శ్రావణ్ చిరునవ్వులు ఆ ఇంట్లో వెలుగులు నింపాల్సింది పోయి, విధి ఆడిన వింత నాటకంలో ఆ పసి మొగ్గ అన్యాయంగా రాలిపోయింది. రక్షణగా ఉండాల్సిన వారే కాలయములైతే, ఆ చిన్నారి ఆర్తనాదాలు ఎవరికి వినిపిస్తాయి? కన్నతల్లి ప్రేమకు మించిన నిధి లేదని నమ్మే ఈ సమాజంలో, తన స్వార్థం కోసం కన్నబిడ్డనే దూరం చేసుకున్న ఈ ఘటన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ప్రేమానురాగాల మధ్య పెరగాల్సిన ఆ ఐదేళ్ల బాలుడి జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలచివేస్తోంది.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజంపేట గ్రామానికి చెందిన దొబ్బుల రమేష్ భార్య లక్ష్మి అలియాస్ రజిత ( ఏ2), తన ఇద్దరు పిల్లలు సమీర (8), శ్రావణ్ (5) లతో కలిసి కామారెడ్డిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో నివసిస్తోంది. భర్తతో విభేదాల కారణంగా విడిగా ఉంటున్న రజిత, రజలిపేట లక్ష్మీనర్సింలు ( ఏ1) అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వీరిద్దరూ తమ ఏకాంతానికి చిన్నారి శ్రావణ్ అడ్డుగా ఉన్నాడని భావించి, వారం రోజుల క్రితమే అతడిని హతమార్చాలని కుట్ర పన్నారు. ఈ క్రమంలో ఈ నెల 17 న సాయంత్రం, రజిత ఇంట్లో లేని సమయంలో లక్ష్మీనర్సింహులు బాలుడిపై దాడి చేశాడు. కళ్లలో కారం కొట్టి, గొంతు,నులిమి అత్యంత క్రూరంగా చంపేశాడు. ఆపై బాత్రూంలో పడిపోయాడంటూ నాటకమాడి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కామారెడ్డి ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు ఏఎస్పీ బి. చైతన్య పర్యవేక్షణలో పట్టణ ఇన్ స్పెక్టర్ బి. నరహరి కేసును లోతుగా దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో నిందితులు హత్య చేసినట్లు వెల్లడైంది. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతోనే తామిద్దరం కలిసి ఈ హత్యకు పథకం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు. ఈ కేసును త్వరితగతిన ఛేదించిన కామారెడ్డి పోలీసులను ఎస్పీ రాజేష్ చంద్ర అభినందించారు.






