దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన.. దంపతుల దారుణ హత్య

by Malleboina Mahesh |

దేశ రాజధాని నగరం అయిన ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన.. దంపతుల దారుణ హత్య
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని నగరం అయిన ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘోర సంఘటన తూర్పు ఢిల్లీలోని షాదరా ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామ్ నగర్ ఎక్స్‌టెన్షన్‌లో నివసిస్తున్న ఓ వృద్ధ దంపతులు తమ నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. మృతులను రిటైర్డ్ ఉపాధ్యాయుడు వీరేందర్ కుమార్ బన్సల్ (75), అతని భార్య పర్వేష్ బన్సల్ (65)గా పోలీసులు గుర్తించారు. ఆదివారం 12:30 గంటల సమయంలో వారి కుమారుడు వైభవ్ బన్సల్ తన తల్లిదండ్రులు స్పృహ లేకుండా పడి ఉన్నారని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇల్లు మొత్తం చెల్లాచెదురుగా ఉండటం గమనించారు. వృద్ధ దంపతుల మృతదేహాలు ఇంటి మూడో అంతస్తులోని వేర్వేరు గదుల్లో పడి ఉన్నాయి. వీరేందర్ కుమార్ ముఖంపై తీవ్రమైన గాయాలు ఉన్నట్లు, ఆయనపై దుండగులు దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇంట్లో విలువైన వస్తువులు మాయమవడంతో, దోపిడీ కోణంలోనే ఈ హత్యలు జరిగి ఉండవచ్చని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (షాదరా) ప్రశాంత్ గౌతమ్ వెల్లడించారు. ప్రస్తుతం క్రైమ్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. కొత్త ఏడాది ప్రారంభంలోనే ఇలాంటి దారుణ హత్యలు జరగడం స్థానికంగా కలకలం రేపింది.

Next Story