- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుర్తుతెలియని దుండగుల చేతిలో యువకుడి దారుణ హత్య..
by Batti.Sumithra |
గుర్తుతెలియని దుండగుల చేతిలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు.

X
దిశ, మామడ : గుర్తుతెలియని దుండగుల చేతిలో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. గురువారం మండలంలోని పొనకల్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. పొన్కల్ గ్రామానికి చెందిన తాటికొండ వినోద్ (28) ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఇతను గత మూడు రోజుల నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఎక్కడ వెతికిన ఆచూకీ లభించలేదు.
పశువుల కాపర్లు వినోద్ శవాన్ని చూసి గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో సంఘటన స్థలానికి సీఐ నవీన్ కుమార్, ఎస్సై అశోక్ లు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. సంఘటనా స్థలంలో దారుణ హత్యకు గురై విగీత జీవిగా పడిఉన్న వినోద్ ను చూసి అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






