- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీపీసీ టౌన్‌షిప్ పీటీఎస్‌లో దారుణ హత్య..డబ్బుల కోసం ఘర్షణ!
పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ టౌన్‌షిప్ పీటీఎస్ లో దారుణ హత్య జరిగింది.

దిశ, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ టౌన్‌షిప్ పీటీఎస్ లో దారుణ హత్య జరిగింది. బుధవారం రాత్రి మద్యం మత్తులో డబ్బుల కోసం ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఓ వ్యక్తి, మహారాష్ట్రకు చెందిన వినోద్ బుహాజీ సోంకర్ అనే వ్యక్తిని రాడుతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం తోటి కార్మికులు మృతదేహాన్ని గుర్తించగా అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. ఎన్టీపీసీ పెర్మనెంట్ టౌన్‌షిప్ లో భవన నిర్మాణం కోసం కార్మికులు మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చారు. మర్డర్ అయిన విషయం ఎన్టీపీసీ పోలీసులకు తెలియగానే మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి గోదావరిఖని ఏసీపీ ఎన్టీపీసీ పోలీసులు వచ్చి మర్డర్ గల కారణాలు తెలుసుకుంటున్నారు. సంఘటనకు పాల్పడ్డ మృతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. సాయంత్రం సంఘటన వివరాలను పోలీసులు వెల్లడిస్తారని సమాచారం.






