Brutal Murder: నగర శివారులో ఘోరం.. మహిళ దారుణ హత్య

by Kema Shiva Kumar |

నగర శివారులో దారుణం జరిగింది. గుర్తు తెలియని మహిళను దుండగులు అతి కిరాతంగం హత్య చేసి చెట్ల పొదల్లో పడేశారు.

Brutal Murder: నగర శివారులో ఘోరం.. మహిళ దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: గుర్తు తెలియని దుండగులు ఓ మహిళను దారుణంగా హతమార్చిన ఘటన మేడ్చల్ (Medchal) జిల్లా జవహర్‌ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ (Dammaiguda)లో చోటుచేసుకుంది. స్థానిక సమాచారం ప్రకారం.. దమ్మాయిగూడ సమీపంలోని పొదల్లో ఓ మహిళ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జవహర్‌ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దుండగులు మహిళను మరేదైనా ప్రాంతంలో హత్య చేసి, ఇక్కడ మృతదేహాన్ని పడేశారా లేదా ఇక్కడే హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆధారాల కోసం వేట..

పోలీసులు ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పటికీ, మృతురాలికి సంబంధించిన ఎటువంటి గుర్తింపు కార్డులు, ఆధారాలు లభించలేదు. దీంతో మృతురాలు అసలు ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చింది? అనే విషయాలు ప్రస్తుతం మిస్టరీగా మారాయి. క్లూస్ టీమ్ (Clues Team), డాగ్ స్క్వాడ్ (Dog Squad) సాయంతో పోలీసులు ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితురాలి వివరాల కోసం పరిసర ప్రాంతాల్లోని సీసీ టీవీ కెమెరాలను చెక్ చేస్తున్నారు.

Next Story